priest cheated:పూజారి అంటే భగవంతుడికి, భక్తుడిగా అనుసంధాన కర్తగా భావిస్తారు. కొందరైతే ఆలయ పూజారులనే భగవత్ వారధిగా భావిస్తూ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఆశీర్వాదం పొందుతుంటారు. పరమ పవిత్రతతో దేవుడికి పూజలు చేస్తూ భక్తుల్లో మరింత పవిత్రతను తేవడం పూజారుల వంతు. మరి అలా దైవత్వం నిండుకొని ఉంటే పూజారిలో రాక్షస ప్రవృత్తి చేరితే.. ఇక్కడా అదే జరిగింది.
priest cheated:బెంగళూరు నగరానికి చెందిన ఓ మహిళ (38) కుటుంబ జీవన సమస్యలతో బాధపడుతున్నది. పలుచోట్ల తిరిగినా ఆమెకు సాంత్వన కుదరలేదు. గుడులు, గోపురాలు తిరుగుతూ కేరళలోని ఓ ఆలయానికీ పూజలు చేసేందుకు వెళ్లింది. అక్కడే దైవత్వం కప్పుకొని లోపల రాక్షస ప్రవృత్తితో ఉన్న ఓ పూజారి ఉన్నాడు. కానీ, ఆయనలో ఆ మహిళ దైవత్వాన్ని చూసింది. ఆయనకు తన గోడు చెప్పుకున్నది.
priest cheated:ఈ ఆలయంలో పూజలు చేస్తే నీకున్న సకల సమస్యలు తీరిపోతాయని ఆ పూజారి అరుణ్ ఆ మహిళను నమ్మబలికాడు. దీంతో ఆ మహిళ ఆ పూజారి మాటలను నమ్మింది. తన బాధలు ఇప్పటితోనైనా తీరుతాయని భావించింది. కఠిన పూజలు ఉంటాయని చెప్పినా, తన జీవితంలోని కఠినత్వం కన్నా ఇక కఠినత్వం ఏముంటుందని భావించింది.
priest cheated:పూజలు చేసే తొలుతే ఆమెకు కఠిన నియమం చెప్పాడు. ఒంటిపై నూలుపోగు లేకుండా పూజలో పాల్గొనాలని ఆ పూజారి ఆదేశించాడు. అలా చేస్తేనన్న తన బాధలు పోతాయేమోనని ఆ అమాయకురాలు నమ్మి ఆ పూజారి చెప్పినట్టే పూజల్లో పాల్గొన్నది. మధ్యలో విపరీత భయాందోళనకు గురైన ఆ మహిళ పూజలు అయిపోయాక, బిక్కుబిక్కు మంటూ ఇంటికి తిరిగి వెళ్లింది.
priest cheated:ఇక తన సమస్యలు తీరి సాంత్వన చేకూరుతుందేమోనని ఆశతో ఆ మహిళ ఉన్నది. ఇంతలో పిడుగుపాటు వార్త ఆమెకు చేరింది. మళ్లీ పూజకు రావాల్సిందిగా ఆ పూజారి అరుణ్ ఆదేశించాడు. ఎందుకని ప్రశ్నించిన ఆ మహిళకు అవాక్కయ్యే కటువైన పదాలు వినిపించాయి. బట్టలు లేకుండా పూజల్లో పాల్గొన్న వీడియోలు, ఫొటోలు తన వద్ద ఉన్నాయని బెదిరించాడు.
priest cheated:దీంతో చేసేది లేక పూజకోసమేనని నమ్మి వెళ్లింది ఆ మహిళ. ఇదే అదను కోసం పూజారి ముసుగులో ఉన్న ఆ రాక్షసుడు ఎదురుచూస్తున్నాడు. ఆమె వచ్చీరాగానే ఆమెను బలవంతంగా లాక్కెళ్లి లైంగికదాడికి దిగాడు. ఆమె ఎంతలా వారించినా, నగ్న వీడియోలు, ఫొటోలు బయటపెడతానంటూ బెదిరించి మరీ లోబర్చుకున్నాడు.
priest cheated:ఆ తర్వాత మరో ఆ దుర్మార్గుడు మరో ఆర్డర్ వేశాడు. తాను ఎప్పుడు రావాలంటే అప్పుడు రావాల్సిందేనని బెదిరించాడు. మోసపోయిన ఆ మహిళ బెంగళూరు వెళ్లాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు పూసగుచ్చినట్టు వివరించింది. ఈ మేరకు పూజారి అరుణ్‌ను అరెస్టు చేసిన పోలీసులు, అతనికి సహకరించిన మరో వ్యక్తికోసం గాలిస్తున్నారు.