Operation Sindoor

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. ఉదయం 10 గంటలకు ఆర్మీ ప్రెస్‌మీట్‌

Operation Sindoor: పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రదాడికి భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో గట్టి ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)తో పాటు పాకిస్తాన్‌లోని తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలపై భారత సాయుధ దళాలు సమన్విత మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ దాడులను విజయవంతంగా నిర్వహించినట్లు భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.

ఆపరేషన్ విజయవంతం – త్రివిధ దళాల సమన్వయం

ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం, వాయుసేన, నావికాదళం కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. లక్ష్యంగా ఎంచుకున్న స్థావరాల్లో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌ వంటి సంస్థల శిక్షణా శిబిరాలున్నాయి. ఈ క్యాంపులపై మిస్సైళ్లతో దాడులు జరిపారు.

లక్ష్యంగా ఎంచుకున్న ప్రాంతాలు:

  • బహావల్‌పూర్‌లోని మర్కాజ్‌ సుభాన్‌ ఉగ్రస్థావరం
  • మురిడ్కేలోని మర్కాజ్‌ తోయిబా ఉగ్రస్థావరం
  • తెహ్రా కలాన్‌లోని సర్జల్‌ ఉగ్రస్థావరం
  • సియల్‌కోట్‌లోని మెహ్‌మూనా జోయా ఉగ్రస్థావరం
  • బర్నాలలోని మర్కాజ్‌ అహ్లే హదిత్‌ ఉగ్రస్థావరం
  • కోట్లిలోని మర్కాజ్‌ అబ్బాస్‌ ఉగ్రస్థావరం
  • కోట్లిలోని మస్కర్‌ రహీల్‌ షహీద్‌ ఉగ్రస్థావరం
  • ముజఫరాబాద్‌లోని షవాయ్‌ నల్లాహ్‌ ఉగ్రస్థావరం
  • ముజఫరాబాద్‌లోని సైద్నా బిలాల్‌ ఉగ్రస్థావరం

ఈ కేంద్రాల్లో పాక్ మద్దతుతో ఉగ్రవాద శిక్షణలు కొనసాగుతున్నట్టు నిఘా సంస్థలు ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ చర్యలు – సమీక్షలు తక్షణం

ఈ దాడుల నేపథ్యంలో ఉదయం 10 గంటలకు భారత సైన్యం, విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనుంది. అనంతరం 11 గంటలకు భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ అత్యవసర భేటీ జరపనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గం సైతం సమావేశం కానుంది.

ఇది కూడా చదవండి: Operation Sindoor: ఆప‌రేష‌న్ సిందూర్.. 100 మందికి పైగా టెర్రరిస్టులు హ‌తం..!

సరిహద్దుల్లో ఉద్రిక్తత – భారత సైన్యం అప్రమత్తం

దాడుల అనంతరం పాక్ సైన్యం సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడుతోంది. అయితే భారత సైన్యం తక్షణమే స్పందిస్తూ తీవ్రంగా ప్రతిచర్యలు చేపడుతోంది. ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో మాట్లాడి పరిస్థితులపై సమగ్ర నివేదిక కోరినట్లు సమాచారం.

భవిష్య వ్యూహంపై చర్చ

ఆపరేషన్ అనంతరం భారత్ త్రివిధ దళాల మధ్య భద్రతా సమీక్షలు కొనసాగుతున్నాయి. రక్షణ రంగ సంస్థలతో సమన్వయం పెంచుతూ, భవిష్యత్తు ఉగ్ర ముప్పులపై వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రభుత్వం కదులుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *