Praksh Raj: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. హిందీ భాషను రాజ్యభాషగా పేర్కొన్న ఆయన మాటలపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వీడియోను షేర్ చేస్తూ… “ఈ స్థాయికి అమ్ముకోవడమా? ఛీ.. ఛీ..” అంటూ తీవ్రంగా విమర్శించారు.
హిందీ పెద్దమ్మ భాష అంటారా..?
పవన్ కళ్యాణ్ ఇటీవల మాట్లాడుతూ “తెలుగు మా అమ్మభాష అయితే… హిందీ పెద్దమ్మ భాష” అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో హిందీకి వ్యతిరేకత ఎక్కువగా ఉండగా… పవన్ ఇలా మాట్లాడడంపై ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. “హిందీని రుద్దడాన్ని వ్యతిరేకించడం భాషాప్రేమ. మాతృభాష గౌరవమే.. ఇది ద్వేషం కాదు” అంటూ స్పష్టంగా చెప్పేశారు.
పవన్ కళ్యాణ్‌ను నిలదీసిన ప్రకాష్ రాజ్
దీనితోనే ఆగలేదు ప్రకాశ్ రాజ్. గతంలో తిరుపతి లడ్డూ కల్తీపై పవన్ చేసిన వ్యాఖ్యలు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు విషయాలు తీసుకొచ్చారు. “సనాతన ధర్మాన్ని రక్షించడానికి నువ్వెవరు పవన్ కళ్యాణ్? నీ అర్హత ఏంటి చెప్పు” అంటూ నిలదీశారు. తిరుపతి లడ్డూ కల్తీపై ఆందోళన సృష్టించకూడదని, దోషులను శిక్షించాల్సింది ప్రభుత్వమేనన్నారు.
ఇది కూడా చదవండి: Air India Plane Crash: విచారణకు పూర్తిగా సహకరిస్తాం.. AAIB రిపోర్ట్‌పై బోయింగ్, ఎయిర్ఇండియా
సోషల్ మీడియా హీటెక్కించేసిన వివాదం
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్. ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రకాశ్ రాజ్‌పై ఆగ్రహంతో విరుచుకుపడుతున్నారు. మరికొందరు ప్రకాశ్ మాటలకు మద్దతు ఇస్తున్నారు. ఇదే క్రమంలో… “ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడిగా భాషపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదు” అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
పవన్ వివరణ ఇస్తారా..?
తెలుగు ప్రజల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న పవన్ వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలా భాషా అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచిస్తున్నారు. భారత్ లాంటి భిన్నతా దేశంలో స్థానిక భాషలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.
ఈ range కి అమ్ముకోవడమా ….ఛి…ఛీ… #justasking https://t.co/Fv9iIU6PFj
— Prakash Raj (@prakashraaj) July 11, 2025