Prakash Raj

Prakash Raj: సత్యదాదాగా ప్రకాశ్ రాజ్.. ‘ఓజీ’లో విలక్షణ నటుడు

Prakash Raj: పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఓజీ’ సినిమాలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. చిత్రంలో ఆయన ‘సత్య దాదా’ అనే పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ప్రకాశ్‌ రాజ్‌ సీరియస్‌ లుక్‌లో కనిపించారు. పోస్టర్‌ ఆధారంగా ఆయన పాత్ర కీలకమని అర్థమవుతోంది. ప్రకాశ్ రాజ్ పాత్ర ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లలో కూడా కీలకమైనదిగా ఉంటుందని తెలుస్తోంది. ఖుషి’, ‘బద్రి’, ‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’ వంటి హిట్ చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్, ప్రకాశ్ రాజ్‌ల కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది.

ఈ ఇద్దరు దిగ్గజ నటుల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి, ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకున్నాయి. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్సరసన ప్రియాంకా మోహన్‌ నటించారు. ఇమ్రాన్‌ హష్మీ విలన్‌. శ్రియారెడ్డి, అర్జున్‌దాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం దీని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం ఈ నెల‌ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఓజీ’ కథను దర్శకుడు సుజీత్ చాలా సంవత్సరాల క్రితం రాశారు.

ఇది కూడా చదవండి: AP Liquor Scam Case: ₹10,835 కోట్ల కుంభకోణం.. ఏపీ లిక్కర్ స్కాం పూర్తి వివరాలు..!

ఇది పవన్‌తో చేయాలని ఆయన మొదటి నుంచీ అనుకున్నారు. ఒక గ్యాంగ్‌స్టర్ కథను ఇంత స్టైలిష్‌గా, గ్రాండ్‌గా తెరకెక్కించే అవకాశం దక్కడం ఆయనకు ఒక కల నిజమైనట్లుగా భావిస్తున్నారు. ఈ సినిమాలోని తన పాత్ర కోసం పవన్ కళ్యాణ్ తన ఫిజిక్, స్టైల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గత చిత్రాలతో పోలిస్తే, ఇందులో ఆయన లుక్ చాలా స్టైలిష్‌గా, యువకుడిలా కనిపిస్తుంది. ‘ఓజీ’ సినిమా కేవలం ఒక భాగం మాత్రమే కాదని, దీనికి సీక్వెల్స్ కూడా ఉండే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది ఒక ఫ్రాంఛైజ్‌గా మారే అవకాశం ఉందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *