Pradeep Machiraju

Pradeep Machiraju: మహేష్ తో ‘లే లే లే లే..’ అనిపించిన ప్రదీప్!?

Pradeep Machiraju: యాంకర్ గా బిజీగా ఉండే ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. నితిన్-భరత్ ఈ సినిమాకు దర్శకులు. దీపికా పిల్లి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నుంచి ‘లే లే లే లే’ అనే పాటను మహేష్ బాబు ఆవిష్కరించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని మాంక్స్ అండ్ మంకీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పుడు ఈ సింగిల్ తో సినిమా ప్రచారాన్ని ఆరంభించారు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రదీప్ హీరోగా నటించిన తొలి సినిమాలో ‘నీలి నీలి ఆశాకం’ పాట ఎన్నో వారాల పాటు చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ పాట కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందంటోంది యూనిట్. చాలా గ్యాప్ తర్వాత ఉదిత్ నారాయణ్ తెలుగులో పాడారు. శ్రీధర్ ఆవునూరి రాసిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించారు. వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  మేఘాలయలో భారీ వర్షాలు.. 10 మంది మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *