SIR Draft Voter List: ప్రత్యేక సమగ్ర సవరణ (SIR – Special Intensive Revision) తర్వాత విడుదలైన డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో తమ పేర్లు గల్లంతై ఆందోళన చెందుతున్న లక్షలాది మంది ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) భారీ ఊరట కల్పించింది! ఓటరు జాబితాలో పేరు మళ్లీ చేర్చుకోవడానికి కొత్త ఓటర్ల కోసం వాడే ‘ఫామ్-6’ (Form-6) ద్వారా దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి చట్టపరమైన చర్యలు గానీ, విచారణ గానీ ఉండవని ఈసీ స్పష్టం చేసింది. మహారాష్ట్ర, ఢిల్లీలలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా శనివారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈసీ ఈ మేరకు కీలక హామీ ఇచ్చింది.
అసలు ఓటర్లలో భయం ఎందుకు? – సెక్షన్ 31 వివాదంపై ఈసీ క్లారిటీ!
సాధారణంగా ‘ఫామ్-6’ అనేది మొదటిసారి ఓటరుగా నమోదు చేసుకునే వారి కోసం ఉపయోగిస్తారు. అందులో “నా పేరు ఇప్పటివరకు ఏ ఓటరు జాబితాలోనూ లేదు” అనే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
-
చట్టపరమైన చర్యల భయం: గతంలో ఓటరుగా ఉండి, తాజా SIR డ్రాఫ్ట్ జాబితాలో పేరు తొలగించబడిన వారు మళ్లీ ఫామ్-6 సమర్పిస్తే.. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 31 (Section 31) కింద తప్పుడు సమాచారం ఇచ్చారనే కారణంతో కేసులు పెడతారేమోనని ఓటర్లు భయపడ్డారు.
-
ఈసీ భరోసా: దీనిపై స్పందించిన ఈసీ.. గతంలో ఓటరు జాబితాలో పేరు ఉండి, SIR డ్రాఫ్ట్ లిస్టులో పేరు లేనివారు ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారిపై ఎలాంటి ప్రాసిక్యూషన్ (చట్టపరమైన చర్యలు) ఉండదని తేల్చిచెప్పింది. అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
-
ఒకే ఒక్క కండిషన్: ఫామ్-6 ద్వారా మళ్లీ పేరు చేర్చుకోవాలనుకునే ఓటరుకు దేశంలోని మరే ఇతర అసెంబ్లీ లేదా పార్లమెంటు నియోజకవర్గంలో ఓటు ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది.
పేరు లేనివారు ఓటరు జాబితాలో పేరు చేర్చుకోవడం ఎలా? (ఆఫ్‌లైన్ & ఆన్‌లైన్)
-
ఫామ్-6 (Form-6) ద్వారా: డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేనివారు ప్రస్తుతానికి ఎటువంటి మార్పులు లేని పాత ఫామ్-6 ద్వారానే కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
-
ఎన్యుమరేషన్ ఫారం (Enumeration Form) సమర్పణ: ఇల్లు మారకుండా అదే చిరునామాలో ఉండి, గతంలో SIR సమయంలో ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వలేకపోయిన వారు ఇప్పుడు దానిని సమర్పించవచ్చు. గతంలో ఫామ్ ఎందుకు ఇవ్వలేదో కారణాన్ని పేర్కొంటూ సంతకం చేసిన ఫారాన్ని మీ ప్రాంత BLO, ERO లేదా AERO లకు స్వయంగా గానీ, కుటుంబ సభ్యుల ద్వారా గానీ అందించవచ్చు.
-
ఆన్‌లైన్‌లో ఈసీఐనెట్ (ECINET) ద్వారా: కార్యాలయాల చుట్టూ తిరగలేని వారు ECINET వెబ్‌సైట్ ద్వారా ఇ-సైన్ (e-Sign) సాయంతో ఆన్‌లైన్‌లోనే ఎన్యుమరేషన్ ఫారాన్ని సమర్పించి తమ పేరును తుది ఓటరు జాబితాలో చేర్చుకోవచ్చు.
