Suriya 45: ఇటీవల పాన్ ఇండియా సినిమా ‘కంగువ’తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సూర్య కొత్త చిత్రం చెన్నైలో ఆరంభం అయింది. సూర్య45 వర్కింగ్ టైటిల్ తో రూపొందే ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పతాకంపై రూపొందిస్తున్నారు. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన బాలాజీ నటుడు, గాయకుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. నయనతారతో ఆర్.జె. బాలాజీ తీసిన ‘అమ్మోరు తల్లి’ తమిళనాటనే కాదు తెలుగులో కూడా చక్కటి విజయాన్ని సాధించింది. అమ్మోరు తల్లి తర్వాత బాలాజీ సత్యరాజ్ తో తీసిన ‘వీట్లో విశేషం’ కూడా మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు సూర్యతో దర్శకుడుగా మూడో సినిమా చేస్తున్నాడు బాలాజీ.
ఇది కూడా చదవండి: Pushpa 2: పుష్ప 2 సెన్సార్ ఒకే.. రన్ టైమ్ తెలిస్తే షాకే!
Suriya 45: ఫాంటసీ యాక్షన్ సినిమాగా రూపొందే ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించనున్నారు. వీలయినంత తొందరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటించిన సినిమా షూటింగ్ పూర్తయింది. పూజా హేగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గాంగ్ స్టర్ కథాంశంతో రూపొందింది. దీనిని వచ్చే ఏడాది ప్రథమార్ధంలో రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’తో కంగు తిన్న సూర్య ఈ రెండు సినిమాలతో హిట్స్ కొట్టాలని కోరుకుందాం.