Talasani Srinivas Yadav: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ సమీపంలో పెడుతున్న ఇథనాల్ కంపెనీతో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని, ఉన్నట్టు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చాలెంజ్ విసిరారు. మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఆ కంపెనీని రాసిస్తానని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
Talasani Srinivas Yadav: ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో తన కుమారుడికి సంబంధం ఉందని సీతక్క, మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారని తలసాని తెలిపారు. రాజమండ్రి వద్ద ఒక డిస్టిలరీస్ కంపెనీలో 8 మంది డైరెక్టర్లలో తన కొడుకు ఒకరని, 2016లోనే ఆ డిస్టిలరీస్ కంపెనీ డైరెక్టర్ పదవికి తన కుమారుడు రాజీనామా చేశారని తెలిపారు. ఆ పేపర్లను పట్టుకొని సీతక్క, మహేశ్‌కుమార్ తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
Talasani Srinivas Yadav: ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని తలసాని వివరించారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంబంధం లేదని, ఇథనాల్ కంపెనీ అనుమతులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని తలసాని చెప్పారు. దీనికి తన కుటుంబంపై అనవసర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.