The Raja Saab

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రన్‌టైమ్ లీక్.. బుకింగ్స్ స్టార్ట్?

The Raja Saab: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా బుకింగ్స్ అమెరికాలో ప్రారంభమయ్యాయి. ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటల 14 నిమిషాలుగా తేలింది. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ ‘ది రాజాసాబ్’ చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. అమెరికా టికెట్ బుకింగ్ సైట్స్‌లో రన్‌టైమ్ 3 గంటల 14 నిమిషాలుగా పేర్కొనడంతో ఈ విషయం బయటపడింది.

Also Read: Ravi Teja: రవితేజ కొత్త సినిమాలో ఆరుగురు హీరోయిన్లు?

ప్రభాస్ ఇటీవలి చిత్రాలన్నీ మూడు గంటలు దాటిన నిడివినే కలిగి ఉండటం గమనార్హం. మారుతీ సినిమాలు సాధారణంగా క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి ఈ భిన్న కాంబినేషన్‌తో ఈ చిత్రం ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మొదట డిసెంబర్‌లో రిలీజ్ ప్లాన్ చేసిన మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా జనవరి 9కి వాయిదా వేశారు. ఈ సినిమా 2డీ, ఐమాక్స్‌తో సహా అన్ని ఫార్మాట్లలో ఒకేసారి రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *