Ram Charan: రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి విడుదలకు ముస్తాబవుతోంది. దీనికోసం ప్రచారంలో బిజీగా ఉన్నాడు చెర్రీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అమెరికాలోని డల్లాస్ లో ప్లాన్ చేశారు. దీనికోసం అమెరికా వెళ్ళాడు చరణ్. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ కు ఇండియాలోనే అతి పెద్ద కటౌట్ పెట్టబోతున్నారు. డిసెంబర్ 29న విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్ లో సాయంత్రి 4 గంటలకు ఈ భారీ కటౌట్ ను ఆవిష్కరించబోతున్నారు. దాదాపు 250 అడుగుల కటౌట్ ఇది. గతంలో అతి పెద్ద కటౌట్ ఎత్తు 230 అడుగులు.
ఇది కూడా చదవండి: KTR: కేటీఆర్ డిఫెన్స్‌లో పడ్డారా ఆ వ్యాఖ్యల అర్థమేంటి.
Ram Charan: దానిని మించి 250 అడుగుల ఎత్తులో ఈ భారీ కటౌట్ ని ఏర్పాటు చేస్తున్నారు చరణ్ అభిమానులు. దీనికి ముందు ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ ను డిసెంబర్ 27న హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ గ్రౌండ్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారట. ఇక ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ను జనవరి 4వ తేదీన రాజమండ్రిలో భారీ జన సందోహం మధ్య జరపనున్నారు. ఈ వేడుకకు ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారట. మరి ఈ ఈవెంట్స్ తో ‘గేమ్ ఛేంజర్’ పై ఎలాంటి బజ్ ఏర్పడుతుందో చూడాలి.
జనవరి 1న రాబోతున్న ‘క్రావెన్ ది హంటర్
Kraven: వరల్డ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు హాలీవుడ్ హార్ట్ థ్రాబ్ టేలర్ జాన్సన్. స్ట్రిక్ట్ డైట్ తో, కఠినమైన వ్యాయామంతో చక్కని ఫిజిక్ ను సొంతం చేసుకున్నాడు. అతను నటించిన తాజా చిత్రం ‘క్రావెన్ ది హంటర్’ జనవరి 1న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. సోనీ పిక్చర్ ఎంటర్ టైన్ మెంట్స్ దీనిని రిలీజ్ చేస్తోంది. ‘క్రావెన్ ది హంటర్’ యాక్షన్ తో కూడుకున్న ఆర్ రేటెడ్ మూవీ అని మేకర్స్ తెలిపారు.
Kraven: ఆరోన్ టేలర్ జాన్సన్ తండ్రిగా ఈ సినిమాలో రస్సెల్ క్రోవ్ చేశాడు. అతనో భయంకరమైన గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. తండ్రి కారణంగా క్రావెన్ ఎలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందనేది ఇందులో దర్శకుడు జె.సి. ఆసక్తికరంగా చూపించాడు. ఇందులో చాందోర్, అరియానా డిబోస్, ఫ్రెడ్ హెచింగర్, అలెశాండ్రో నివోలా, క్రిస్టోఫర్ అబాట్ ఇతర కీలక పాత్రలు పోషించారు.