Fauzi: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో వస్తున్న క్రేజీ వార్ మూవీ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ మీద టాలీవుడ్‌లో కొత్త చర్చ మొదలైంది. నిజానికి ఈ సినిమాను డిసెంబర్ 3నే థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ తాజా టాక్ ప్రకారం సినిమా అనుకున్న టైమ్‌కి రావడం కష్టమే అంటున్నారు. భారీ గ్రాఫిక్స్ (VFX), పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా బ్యాలెన్స్ ఉండటంతో మేకర్స్ రిలీజ్ డేట్‌ను మార్చే ఆలోచనలో పడ్డారు.
ప్రభాస్ తన షూటింగ్ పార్ట్‌ను నవంబర్ కల్లా పూర్తి చేయనున్నారు. కానీ డైరెక్టర్ హను రాఘవపూడి మాత్రం గ్రాఫిక్స్, సీజీఐ పనుల్లో ఏమాత్రం హడావుడి పడకూడదని, ఔట్‌పుట్ పక్కాగా రావాలని టైమ్ కోరుకుంటున్నారు. అందుకే డిసెంబర్ బదులు జనవరి 26, 2027 (రిపబ్లిక్ డే) నాడు రిలీజ్ చేస్తే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నారు. కథ కూడా స్వాతంత్య్రానికి ముందు జరిగేది కాబట్టి, రిపబ్లిక్ డే వీకెండ్ అయితే లాంగ్ రన్, హాలిడే అడ్వాంటేజ్ బాగా కలిసివస్తుందని ఆలోచిస్తున్నారు. అయితే ‘ఫౌజీ’ జనవరికి వెళ్తే.. వచ్చే ఏడాది మార్చిలో రావాల్సిన సందీప్ రెడ్డి వంగా సినిమా ‘స్పిరిట్’ కూడా మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త అప్‌సెట్ అవుతున్నారు.
డిసెంబర్‌లో బాక్సాఫీస్ బరిలో ఉన్న సినిమాలు ఇవే..
‘ఫౌజీ’ డిసెంబర్ రేసు నుంచి తప్పుకుంటుంది అనే వార్తలు రావడంతో తమ సినిమాల రిలీజ్ చెయ్యడానికి చిన్న, సీనియర్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి.
-
వృషకర్మ (Vrushakarma): నాగచైతన్య హీరోగా వస్తున్న మిస్టీరియస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ డిసెంబర్ 4న రిలీజ్ కానుంది.
-
కింగ్ (King): షారుఖ్ ఖాన్, డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ యాక్షన్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రాబోతోంది.
-
NBK 111: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న మాస్ గ్యాంగ్‌స్టర్ మూవీ కూడా డిసెంబర్ 24నే టార్గెట్ చేసింది.
-
రాపో 23 & లెగసీ: రామ్ పోతినేని ‘ఏక: ది లోన్ వోల్ఫ్’తో పాటు విశ్వక్ సేన్ ‘లెగసీ’ సినిమాలు కూడా డిసెంబర్ రిలీజ్‌కే రెడీ అవుతున్నాయి.
ఓటీటీ డీల్స్, బిజినెస్ లెక్కలు చూసుకుని ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ మీద మైత్రీ మేకర్స్ త్వరలోనే ఒక అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చే అవకాశం ఉంది.
