Prabhas Birthday: ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇమేజ్ ప్రపంచ వ్యాప్తం అయిపోయింది. పలు దేశాలలో ప్రభాస్ నటించిన సినిమాల స్క్రీనింగ్ జరుగుతోంది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా అతను నటించిన సినిమాలు రెండు, మూడు రీ-రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే… విదేశాల్లోనూ ప్రభాస్ బర్త్ డే చేయడానికి అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక జపాన్ లోని ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఇప్పటికే ప్రభాస్ బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టేశాయి. టోక్యోలోని ప్రభాస్ అభిమానులు ‘రాధేశ్యామ్’ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసి, అది పూర్తి కాగానే బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
