Hyderabad: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 15 నెలల తర్వాత ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శనివారం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కోసం కస్టమ్స్ అధికారుల ముందుకు వెళ్లగా, లుకౌట్ నోటీసులు ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు.
తద్వారా విచారణ అధికారులకు ప్రభాకర్ రావు భారత్‌కు చేరుకున్న విషయాన్ని వెంటనే తెలియజేశారు. అన్ని వివరాలు సరిచూసిన అనంతరం క్లియరెన్స్ ఇచ్చి ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌ను పూర్తిచేశారు.
ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన్ను విచారించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే అధికారులు పేర్కొన్నారు. ఆయన విదేశీ ప్రవాసం కారణంగా విచారణ మందకొడిగా సాగింది.
ప్రస్తుతం ఆయన తిరిగి దేశానికి వచ్చిన నేపథ్యంలో కేసు మళ్లీ ఉత్కంఠకరంగా మారే అవకాశముంది. ఈ వ్యవహారంపై పోలీసులు త్వరలోనే స్పందించే అవకాశముందని సమాచారం.