Pottel: యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘పొట్టేల్’. నిశాంక్ రెడ్డి, సురేశ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాను సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేశారు. ఈ నెల 25న సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా ప్రముఖ కథానాయిక సంయుక్త ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. కూతురు చదువుకోసం ఆరాటపడే తండ్రిగా యువచంద్ర కృష్ణ నటించగా, అమాయకురాలైన అతని భార్యగా అనన్య నాగళ్ళ యాక్ట్ చేసింది. శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందించారు. ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత సంయుక్త మాట్లాడుతూ, ‘ట్రైలర్ ఫస్ట్ షాట్ చూసినప్పుడే ఒక రియల్ పాన్ ఇండియా ఫిల్మ్ లా ఇది అనిపించింది. ఓ మంచి కంటెంట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా చక్కని విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. ట్రైలర్ లో చూస్తోంది ఒక్క శాతమే అని… సినిమా ఆడియెన్స్ తో ట్రావెల్ చేసేలా ఉంటుందని అనన్య తెలిపింది. ‘విక్రమార్కుడు’ తర్వాత తనకు ఎంతో తృప్తిని కలిగించే పాత్ర ఇందులో చేశానని అజయ్ చెప్పారు.

