Post Office Scheme: భారత తపాలా శాఖ ఇన్సూరెన్స్, సేవింగ్స్ విషయాల్లో ఎప్పటికప్పుడు మంచి స్కీమ్స్ తెస్తుంటుంది. ఈ శాఖ అందించే ఇన్సూరెన్స్, సేవింగ్స్ పథకాలు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. తాజాగా తపాలా శాఖ నుంచి కొత్త ఇన్సూరెన్స్ పధకం ఒకటి అందుబాటులోకి వచ్చింది. తపాలా శాఖ ప్రవేశపెట్టిన ఈ పోస్టల్ బీమా పథకానికి అనూహ్య స్పందన వస్తోంది.
ఇది కూడా చదవండి: Waqf Board: వక్ఫ్ బోర్డు మా భూములు లాక్కుంటోంది.. మహారాష్ట్ర రైతుల ఆరోపణ
Post Office Scheme: దీనిద్వారా కేవలం రూ.399 ప్రీమియం చెల్లించి ఏడాది పాటు ఇన్సూరెన్స్ పొందవచ్చు. ఏదైనా ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే రూ. 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. . పాముకాటుతో మరణించినా, అంగవైకల్యం జరిగినా, విద్యుత్ షాక్ తో మరణించినా బీమా వస్తుందని అధికారులు చెబుతున్నారు. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరినా కూడా కొంత ఇన్సురెన్స్ వస్తుంది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లా కూడా ఇది ఉంటుంది. దీంతో ప్రజలు అధిక సంఖ్యలోఈ పాలసీపై ఆసక్తి చూపిస్తున్నారని అధికారులు అంటున్నారు. మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీసుకు వెళ్లి ఈ ఇన్సురెన్స్ పొందవచ్చు. 18 నుంచి 65 సంవత్సరాల వారు దీనికి అర్హులు.