Gujarat: అదో జైలు. సెంట్రీలు సాధారణ చెకింగ్ చేస్తున్నారు. ఒక సెల్ లో మొబైల్ ఛార్జర్ దొరికింది. దీంతో ఫోన్ కూడా ఉండి ఉండవచ్చని వెదుకులాట మొదలెట్టారు. ఇంతలో ఆ సెల్ లో ఉన్న ఖైదీ వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.అతని వింత ప్రవర్తనతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని ఆసుపత్రికి చేర్చారు. ఆసుపత్రిలో డాక్టర్ ఈ నిందితుడికి అన్ని పరీక్షలు చేసి.. ఎక్స్ రే తీయించారు. ఆ ఎక్స్ రే చూసిన తరువాత డాక్టర్ షాక్ అయ్యారు. ఎందుకంటే, ఆ ఎక్స్ రేలో ఖైదీ పురీషనాళంలో మొబైల్ ఫోన్ కనిపించింది. ఈ స్టోరీ గుజరాత్ లోని భావ్ నగర్ జైలులో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. పోక్సో కేసులో అరెస్టయిన రవి బరయ్య (33) గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా జైలులో అక్టోబర్ 19 నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు లోపలికి మొబైల్ ఫోన్లను అనుమతించరు. అయితే డిసెంబర్ 4న జైలుపై అధికారులు దాడి చేయగా మొబైల్ ఫోన్ ఛార్జర్ కనిపించడంతో అధికారులకు అనుమానం వచ్చింది.
ఇది కూడా చదవండి: Jammu And Kashmir: లో సహచరుడిని కాల్చి.. ఆత్మహత్య చేసుకున్న పోలీస్
Gujarat: అంతటా వెతికినా ఫోన్ కనిపించకపోవడంతో బారయ్య వింత ప్రవర్తన చూసి అనుమానం వచ్చిన పోలీసులు సెల్‌లో వెతికారు. కానీ ఫోన్ దొరకలేదు. అయితే వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి ఎక్స్‌రే తీశారు. స్కాన్ చేయగా మలద్వారంలో మొబైల్ ఉన్నట్లు తేలింది. దీంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ ఘటనపై జైలు అధికారులు ఫిర్యాదు చేయడంతో ఖైదీల చట్టంలోని బీఎన్‌ఎస్ 223, సెక్షన్ 42, 43, 45(12) కింద కేసు నమోదు చేశారు.నిషేధిత మొబైల్ ఫోన్, ఛార్జర్‌ని జైలుకు తీసుకొచ్చింది ఎవరు? రవి ఎంతకాలంగా ఫోన్‌ను ఉపయోగిస్తున్నాడనే దానిపై జైలు అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.