ap news: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి భారీ ఎగుమతులపై రాష్ట్ర పోలీసులు దృష్టి సారించారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే వేలాది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో వారిని అరెస్టు చేసి జైలుపాలు చేశారు. అయినా గంజాయి రవాణా ఆగడం లేదు. కిలోలకొద్దీ రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతూనే ఉన్నది. దీని నిర్మూలనకు పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.
ap news: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో తాజాగా భారీ ఎత్తున గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాల్లోని వీ.మాడుగుల పోలీసులకు ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు 408 కిలోల గంజాయి, రెండు కిలోల గంజాయి (యాశస్) లిక్విడ్‌ను పట్టుకున్నట్టు ఎస్పీ తుహిన్ సిన్హా ప్రకటించారు. వీటి విలువ సుమారు రూ.21 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులతో పాటు ఒక లారీ, బొలేరో వాహనం, పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు.
ap news: ఈ కేసులో చింతపల్లి ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ముగ్గురు ఉండటం గమనార్హం. వీరు నిత్యం అడవుల నుంచి గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. వీరేకాకుండా ఇంకా ఎవరెవరు రవాణా చేస్తున్నారోనని నిందితుల నుంచి పోలీసులు సమాచారాన్ని రాబడుతున్నట్టు తెలిసింది. వీరు గతంలో ఎంత మేరకు, ఎవరెవరికి విక్రయించారోనని ఆరా తీస్తున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, అతను దొరికితే మరింత ఆధారం దొరుకుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ స్మగ్లర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ap news: ఇదే కేసులో అరెస్టయిన వారిలో మరో ముగ్గురు కేరళ రాష్ట్రానికి చెందిన స్మగ్లరు ఉండటంపై పోలీసులు సమగ్ర విచారణకు దిగారు. ముఠాలుగా తయారైన స్మగ్లర్లు గంజాయిని రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఇంకా ఎన్నెన్ని ముఠాలు పనిచేస్తున్నాయోనని తెలుసుకునే పనిలో ఉన్నట్టు తెలిసింది. ఈ కేరళ స్మగ్లర్ల గత చరిత్రను ఆరా తీస్తున్నారు. ఏఏ ప్రాంతాలకు గతంలో గంజాయిని ఎగుమతి చేస్తున్నారోనని సమాచారాన్ని రాబడుతున్నారు. ఈ దాడితో స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.