Ranjith Balakrishnan: మలయాళ చిత్ర దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌పై 31 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశాడు. దీంతో బెంగళూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. డిసెంబరు 2012లో ఈ సంఘటన జరిగినట్టు కంప్లైంట్ చేశాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి చేసిన కంప్లైంట్ వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని ఈస్ట్ హిల్‌లోని “బవుట్టియుడే నమతిల్” సెట్‌లో నటుడు మమ్ముట్టిని కలవడానికి ఆ వ్యక్తి ప్రయత్నించాడు. ఆ సమయంలో రంజిత్‌ను కలిశాడు.
ఇది కూడా చదవండి: Nayanthara: ప్లాస్టిక్ సర్జరీపై స్పందించిన నయనతార.. ఏం చెప్పిందంటే?
Ranjith Balakrishnan: దర్శకుడు సజీర్ చోలైల్ ద్వారా రంజిత్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత బెంగుళూరు విమానాశ్రయం సమీపంలోని తాజ్ హోటల్‌లోని నాలుగో అంతస్తులోని గదికి ఫిర్యాదుదారుని రంజిత్ ఆహ్వానించాడు. అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తికి రంజిత్ మద్యం ఇచ్చాడు. తరువాత ఫిర్యాదుదారుని బట్టలు విప్పి, అనుచితంగా తాకాడు. చివరికి బెడ్‌రూమ్‌కు తీసుకెళ్లి, అనుమతి లేకుండా సన్నిహిత చర్యలకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. IPC సెక్షన్ 377 ప్రకారం కేరళలోని కసాబా పోలీస్ స్టేషన్‌లో ప్రిలిమినరీ కంప్లైంట్ ఫైల్ అయింది. ఈ కంప్లైంట్ పరిశీలించిన కోర్టు కేసును 2024 అక్టోబర్ 25న బెంగళూరుకు బదిలీ చెసింది. అక్టోబర్ 26న అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో బెంగళూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.