PM Narendra Modi:ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటనలో భాగంగా భావోద్వేగానికి గురయ్యారు. ఆపరేషన్ సిందూర్ ఆపరేషన్ గురించి వివరిస్తూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆ ఆపరేషన్ తర్వాత తాను తొలిసారి కాశీకి వచ్చానని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పౌరులను దారుణంగా హత్య చేసిన ఘటనతో తన హృదయం దుఃఖంతో నిండిపోయిందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు.
PM Narendra Modi:వారణాసిలోని సేవాపురి బనౌలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ రూ.21.83.45 కోట్ల విలువైన 52 వివిధ అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.20,500 కోట్లను పీఎం కిసాన్ యోజన చింద జమచేశారు. 20వ విడత ప్రతి రైతు ఖాతాల్లో రూ.2,0000 చొప్పున ప్రధాని విడుదల చేశారు.
PM Narendra Modi:ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పైకీలక వ్యాఖ్యలు చేశారు. శివుడు ఆశీర్వాదంతో నా కుమార్తెల సిందూరానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాననని, ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ఆ భగవంతుడి పాదాలకు అంకితం చేశానని చెప్పారు.