PM Modi: భారత హాకీ స్టార్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన రాణి రాంపాల్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. అసమాన ప్రతిభకు జెర్సీ నంబర్ 28 చిరునామాగా మారిందని ఆయన అన్నారు. అతి పిన్న వయసులో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నువ్వు నీ ఆటతో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించావు. సారథిగా ముందుండి నడిపించిన నువ్వు ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా కొత్త బాధ్యతతో ఆటలోనే కొనసాగడం సంతోషకరమంటూ ప్రధాని మోదీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అభినందనలు తెలిపారు. కాగా, 29 ఏళ్ల రాణి భారత మహిళల హాకీ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.