PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (ఆగస్టు) 29న విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. భారతదేశంపై అమెరికా విధించిన సుంకాల అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారి మోదీ ఈ విదేశీ పర్యటనకు వెళ్తున్నందున దీనికి ప్రాధాన్యం సంతరించుకున్నది. మోదీ ప్రధానంగా జపాన్, చైనా దేశాల్లో నాలుగు రోజులపాటు పర్యటిస్తారు. అక్కడ జరిగే కీలక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.
PM Modi: తొలుత జపాన్ దేశానికి ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. అక్కడి దేశ రాజధాని నగరమైన టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీకి గాయత్రీ మంత్రంతో జపాన్ వాసులు స్వాగతం పలికారు. అనంతరం ప్రవాస భారతీయులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చి అలరించారు. అనంతరం దేశంలో జరిగే వార్షిక శికరాగ్ర సదస్సుల్లో భారత ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
PM Modi: జపాన్ దేశంలో ప్రధాని మోదీ రెండురోజుల పాటు పర్యటించనున్నారు. ఆ తర్వాత చైనా దేశ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆగస్టు 31న ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. ఈ సమావేశమే అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనున్నది. భారత్‌పై అమెరికా సుంకాలు విధించిన వేళ.. భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉన్నదని విశ్లేషకుల అంచనా. ఇదే జరిగితే అమెరికాకు చికాకు తప్పదని భావిస్తున్నారు.