PM Modi G20 summit: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ20 సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారమే (నవంబర్ 21) బ్రిజిల్ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ జోహెన్నెస్‌బర్గ్ బయలుదేరి వెళ్లారు. ఇండియా-బ్రెజిల్-దక్షిణాఫ్రికా (ఐబీఎస్ఏ) నేతల సమావేశంలో ఆయన పాల్గొంటారు. సదస్సులో పాల్గొనే వివిధ ప్రపంచ దేశాల నాయకులతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
PM Modi G20 summit: మూడు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాకు వెళ్లారు. నవంబర్ 21, 22, 23 తేదీల్లో ఆయన అక్కడ పర్యటిస్తారు. భారత్ అధ్యక్షతన 2023లో జరిగిన సమావేశంలో ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కలిగింది. ఆఫ్రికా ఖండంలో జీ20 సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం, ఈ సమావేశంలో మోదీ పాల్గొనడం విశేషంగా భావిస్తున్నారు.
PM Modi G20 summit: ఇదిలా ఉండగా, ఇదే జీ20 సమావేశానికి అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గైర్హాజరయ్యారు. జోహెన్నెస్‌బర్గ్ లో జరిగే జీ20 సదస్సులో జరిగే చర్చల్లో అమెరికా పాల్గొనబోదని వైట్ హౌస్ ప్రతినిధి కరోలినా లీవిట్ ప్రకటించారు. దక్షిణాఫ్రికాలోని మైనారిటీలైన శ్వేతజాతీయులపై జరిగే దాడులకు నిరసనగా ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా తెలిపింది. ఇదే సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరు కానున్నట్టు తెలిసింది.

