PM Modi: నేపాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభమైంది. నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత, ఎన్నికల ప్రక్రియకు ముందుగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఆమె నేపాల్ చరిత్రలో తాత్కాలిక ప్రధాని పదవి చేపట్టిన తొలి మహిళగా నిలిచారు.ఈ సందర్భంగా ఆమెకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సుశీలా కార్కీకి అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన స్నేహ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Cyber Fraud: డిజిటల్ అరెస్ట్.. వృద్ధుడి నుంచి రూ.3.72 కోట్ల దోపిడీ
నేపాల్‌తో కలిసి శాంతి, సుస్థిరత, అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారత్ సహకరిస్తుందని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. సుశీలా కార్కీ న్యాయవ్యవస్థలో అపారమైన అనుభవం కలిగినవారు. ఆమె నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. తాత్కాలిక ప్రధానిగా ఆమె ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడంతో పాటు దేశంలో సుస్థిరతను తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ పరిణామం నేపాల్ రాజకీయాల్లో, ముఖ్యంగా మహిళలకు అధికారం కల్పించే విషయంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోనుంది. కాగా ఆమె 2016 నుంచి 2017 వరకు నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.