PM Kisan yojana: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతను ఈరోజు అంటే అక్టోబర్ 5వ తేదీన (శనివారం) ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈసారి, మహారాష్ట్రలోని వాషిమ్‌కు చెందిన 9.4 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున ప్రధాని మోదీ పంపారు. 18వ విడతగా మొత్తం రూ.20 వేల కోట్లకు పైగా బదిలీ అయింది. ఈ పథకం కింద, మహారాష్ట్రలోని 91.5 లక్షల మంది రైతులు రూ. 2000 కోట్లకు పైగా ప్రత్యక్ష ప్రయోజనాలను పొందారు.
ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 చొప్పున 3 విడతలుగా రూ.2,000 అందజేస్తుంది. మొదటి విడత ఏప్రిల్-జూలై మధ్య, రెండో విడత ఆగస్టు-నవంబర్ మధ్య, మూడో విడత డిసెంబర్-మార్చి మధ్య విడుదలవుతాయి. ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు 17 విడతలుగా రైతుల ఖాతాలకు రూ.3 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని పంపింది.
Also Read: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
17వ విడతలో 9.26 కోట్ల మంది రైతులకు లబ్ది
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడతను జూన్ 18న ప్రధాని విడుదల చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పంపారు. అంటే మొత్తం రూ.20 వేల కోట్లు బదిలీ అయ్యాయి. రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకాన్ని 2019లో ప్రారంభించారు.

