Sankranti : సంక్రాంతి పండక్కు జనం సొంత ఊళ్లకు వెళ్లేందుకు పైనమయ్యారు. ఎంజీబీఎస్ తోపాటు బస్టాండ్ వద్ద కొనసాగుతున్న రద్దీ… తెలంగాణ ఆర్టీసీ నుంచి 6432 బస్సులు ఏర్పాటు చేసిన కొనసాగుతున్న రద్దీ. పండగ స్పెషల్ బస్సుల పేరుతో 50 శాతం రేట్లు పెంచిన ఆర్టీసీ. గతంలో 30% ఉండగా ఇప్పుడు 50% పెంచడంపై జనం ఆగ్రహం. సొంత వాహనాలతో ఊర్లకు పైన మైన నగరవాసులు. హైదరాబాద్ విజయవాడ హైవే పై నిన్నటి నుంచి కొనసాగుతున్న రద్దీ. పంతంగి టోల్ ప్లాజా వద్ద గంటలకు నిలిచిపోతున్న వాహనాలు. ఉదయం నుంచి విజయవాడ హైవే పై కొనసాగుతున్న వాహనాల రద్దీ. పండగ పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ. కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల తనిఖీలు…. ఇప్పటివరకు 12 బస్సులపై కేసులు.
సంక్రాంతి సందర్భంగా 36 ప్రత్యేక రైలు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ చర్లపల్లి రైల్వే స్టేషన్ ల వద్ద ప్రయాణికుల రద్దీ. వందే భారత రైతులకు అదనపు బోగీలు ఏర్పాటు చేసిన నడుపుతున్న రైల్వే శాఖ. మరో వైపు ఫ్లైట్ చార్జీల పెంపుతో విజయవాడ వైజాగ్ తిరుపతి బెంగళూరు వెళ్లే ప్రయాణికులపై పెరుగుతున్న భారం. మొత్తంగా పండక్కి ఊరెళ్ళాలనుకునే సామాన్యులపై అయితే రవాణాచార్జీల మోతతో భారం తప్పడం లేదు.