Champions Trophy 2025: హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తేనే చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం పాకిస్థాన్ కు దక్కుతుందని తెలుస్తున్నా.. భారత్ ఆడకపోతే మొత్తం టోర్నీనే రద్దవడం ఖాయమైనా ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం విషయంలో పాకిస్థాన్ మొండిపట్టు వీడటం లేదు.. టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తేనే పాల్గొంటామని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి తేల్చి చెప్పింది. పాకిస్థాన్ వెళ్లి ఆడేది లేదని స్పష్టం చేసింది. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డును ఐసీసీ కోరింది. ఈ ప్రతిపాదనకు పిసిబి అంగీకరించకపోవడంతో అసలు టోర్నీ మనుగడే ప్రమాదంలో పడింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆధునీకీకరణ పనులను పరిశీలించిన పీసీబీ ఛైర్మన్ మొహసీన్ నఖ్వీ టోర్నీ గురించి మీడియాతో మాట్లాడాడు. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి ఆసక్తి చూపడం లేదంటున్నాడు.
Champions Trophy 2025: భారత్ అభ్యంతరాలను చర్చలతో పరిష్కరించుకుంటామని, క్రీడలు, రాజకీయాలు వేరు. వాటిని రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదని చెప్పాడు. భారత్ ఆడే విషయంలో ఐసీసీ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని, ఐసీసీ త్వరలో షెడ్యూల్‌ను ప్రకటిస్తుందన్న ఆశాభావం నఖ్వీ వ్యక్తం చేసాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉండగా మొత్తం టోర్నమెంట్ పాకిస్థాన్‌లో జరుగుతుందని పీసీబీ చీఫ్ పేర్కొన్నాడు.

