Pakistan Cricket Board

PCB Scam: పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో 595 కోట్ల కుంభకోణం

PCB Scam: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మళ్లీ ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. పాకిస్తాన్ ఆడిటర్ జనరల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో భారీ ఆర్థిక అవకతవకలు, స్పాన్సర్‌షిప్ మోసాలు, బిల్లుల కుంభకోణం బయటపడ్డాయి. దీంతో PCBపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

595 కోట్ల రూపాయల భారీ మోసం

ఆడిటర్ జనరల్ నివేదిక ప్రకారం, గత రెండేళ్లలో PCBలో సుమారు 595 కోట్ల పాకిస్తాన్ రూపాయల కుంభకోణం జరిగింది. ముఖ్యంగా స్పాన్సర్‌షిప్ ఫీజులలోనే అతిపెద్ద అవకతవకలున్నాయని నివేదిక చెబుతోంది. PCB 18.6 మిలియన్ డాలర్లు (రూ.532 కోట్లు) వసూలు చేయకపోవడం మోసంగా పరిగణించారు.

PCB చీఫ్ మొహ్సిన్ నఖ్వీపై ఆరోపణలు

PCB చీఫ్ మరియు ప్రభుత్వ మంత్రిగా ఉన్న మొహ్సిన్ నఖ్వీ కూడా ఈ కుంభకోణంలో భాగమని నివేదికలో ఆరోపించారు. ఫిబ్రవరి 2023 నుండి జూన్ 2025 వరకు యుటిలిటీ బిల్లులు, పెట్రోల్, ఇంటి అద్దె పేరుతో నఖ్వీకి ఇచ్చిన డబ్బు తప్పు ఖర్చుగా పేర్కొన్నారు.ఎందుకంటే ఈ సౌకర్యాల కోసం ప్రభుత్వం ఇప్పటికే ఆయనకు చెల్లిస్తోంది.

ఇది కూడా చదవండి: Yash Dayal: లైంగిక వేధింపుల కేసు .. యశ్ దయాళ్ అరెస్టుపై కోర్టు స్టే 

భద్రత పేరుతో 6.3 కోట్ల రూపాయల ఖర్చు

అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో విదేశీ జట్ల భద్రత కోసం 2.2 లక్షల డాలర్లు (రూ.6.3 కోట్లు) ఖర్చు చేసినట్లు PCB పేర్కొంది. కానీ ఆడిటర్ జనరల్ ప్రకారం, భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వ బాధ్యత, PCB కాదు. కాబట్టి ఈ ఖర్చు తప్పు నిర్ణయం అని నివేదిక చెబుతోంది.

నియామకాలలో అవకతవకలు

ముగ్గురు జూనియర్ కోచ్‌లు, మీడియా డైరెక్టర్ నియామకాల్లో కూడా భారీ అవకతవకలు జరిగినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు.

PCB సమాధానం ఇంకా రాలేదు

ఈ ఆరోపణలపై PCB ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాధానం ఇవ్వలేదు. అయితే ఈ నివేదికతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిష్ట మరోసారి దెబ్బతిన్నది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *