Anna Lezhneva Konidela: సింగపూర్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం అందరికీ కలవరాన్ని కలిగించింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు స్పందనగా పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల తలనీలాలు సమర్పిస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆదివారం రాత్రి అన్నా కొణిదెల ముందుగా వరాహ స్వామిని దర్శించుకుని, అనంతరం గాయత్రి సదనంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. టీటీడీ నియమాల ప్రకారం అన్య మతస్థులు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందుగా తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది. అన్నా కొణిదెల కూడా ఈ ప్రక్రియను పాటించి శ్రద్ధతో సంతకం చేశారు.
ఇది కూడా చదవండి: Thalapathy Vijay: దళపతి విజయ్ సంచలన నిర్ణయం.. వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టుకు
వారాహ స్వామి దర్శనం అనంతరం, శ్రీవారి ముక్కు సందర్భంగా తలనీలాలు సమర్పించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సోమవారం ఉదయం ఆమె వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ ప్రభుత్వ బాధ్యతల్లో నిమగ్నంగా ఉండటంతో ఈ యాత్రకు అన్నా ఒంటరిగా వచ్చారని సమాచారం. కుటుంబాన్ని కాపాడిన దేవుడికి కృతజ్ఞతగా ఈ యాత్ర చేపట్టిన అన్నా కొణిదెల ఆధ్యాత్మికతకు మరో ఉదాహరణగా నిలిచింది.