Pawan Kalyan: శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సత్యసాయి చేసిన అపారమైన సేవలను కొనియాడారు. ఆయన తన ప్రసంగంలో సత్యసాయి గొప్పదనం, ఆయన చూపిన సేవామార్గం గురించి మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సత్యసాయి బాబా కీర్తి కేవలం భారతదేశానికే పరిమితం కాలేదని, విదేశాల్లోనూ సాయి భక్తులను తాను చాలా మందిని చూశానని తెలిపారు. విదేశీయులు కూడా సత్యసాయి చూపిన దయ, సేవ, ఆధ్యాత్మికత గురించి గొప్పగా చెబుతారని పవన్ పేర్కొన్నారు. సత్యసాయి లక్షలాది మంది భక్తులను, వారి జీవితాలను ప్రభావితం చేస్తారని, ఇది మన ప్రాంతానికి దక్కిన అదృష్టమని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇది కూడా చదవండి: Rahul Sipligunj Wedding: పెళ్లి తేదీ ఫిక్స్.. మీరు తప్పకుండా రవళి.. సీఎంని ఆహ్వానించిన రాహుల్
వెనుకబడిన ప్రాంతంలో వెలుగు
సత్యసాయి జన్మస్థలం ఎంపిక గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ, అత్యంత వెనుకబడిన జిల్లాను సత్యసాయి తన జన్మకు ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. సామాన్యుడికి తాగునీరు ఇవ్వాలని సత్యసాయి అప్పుడే ఆలోచించారు అని పవన్ అన్నారు. సత్యసాయి అప్పట్లో చేపట్టిన నీటి సరఫరా పథకమే నేటి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘జల్ జీవన్ మిషన్’కు అంకురం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పుట్టపర్తిలో సత్యసాయి పుట్టడం, ఈ ప్రాంత ప్రజల కోసం సేవలు అందించడం మన అదృష్టం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

