Pawan Kalyan: పహల్గాం ఉగ్రదాడి అనంతరం తాజాగా భారత్ త్రివిధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. తన దైన శైలిలో ఆయన వీరావేశంతో కొన్నివర్గాలకు హెచ్చరికలు చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన తాజాగా మీడియాతోనూ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
Pawan Kalyan: ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేయడంలో భారతదేశంలో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం అని పవన్ కల్యాణ్ కొనియాడారు. పాకిస్తాన్ ప్రజలకు, ఆ దేశ మిలటరీకి ఎలాంటి నష్టం జరగకుండా.. కేవలం ఉగ్రవాదులపై, ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడి చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
Pawan Kalyan: మరో విషయంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికల్లో కొందరు కుక్కలు అరిచినట్టు అరవొద్దని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరూ పోస్టులు పెట్టొద్దని చెప్పారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయన్సర్లు ఏది పడితే అది పెట్టొద్దని చెప్పారు. ఒకవేళ ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Pawan Kalyan: అంతకు ముందు ట్విట్టర్ వేదికగా కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. ధైర్యం లేని చోట ధర్మం కోల్పోతారు. స్వార్థం రాజ్యమేలుతుంది.. అంటూ ప్రముఖ రచయిత దినకర్ హిందీలో రాసిన కవితను పవన్ కల్యాణ్ పోస్టు చేశారు. దశాబ్దాలుగా మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతం కీ.. ఆపరేషన్ సిందూర్‌తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాలకు, వారికి వెన్నంటి నిలిచిన ప్రధాని మోదీకి కృతజ్క్షతలు తెలిపారు. మీ వెన్నంటే మేము.. జైహింద్ అంటూ పవన్ స్పందించారు.

