Pawan Kalyan:ఇంటర్మీడియట్ చదువుతూ విశేష ప్రతిభ చాటిన ఓ విద్యార్థికి ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నగదు ప్రోత్సాహకం అందజేసి మెచ్చుకున్నారు. ఆ విద్యార్థిని వెన్నుతట్టి మరింతగా ఎదగాలని ప్రోత్సహించారు. స్వయంగా ఆ విద్యార్థిని మంగళగిరిలోని జనసేప పార్టీ కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు.
Pawan Kalyan:విజయనగర్ జిల్లా జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదివే విద్యార్థి రాజాపు సిద్ధూ తన ఇంటి నుంచి దూరంగా ఉన్న కాలేజీకి వెళ్లిరావడానికి ఇబ్బందులు పడేవాడు. దీంతో తన ఆలోచనలకు పదునుపెట్టి ఓ బ్యాటరీ సైకిల్‌ను తయారు చేశాడు. మూడు గంటల చార్జితో 80 కిలోమీటర్ల దూరం వెళ్లే బ్యాటరీ సైకిల్‌ను రూపొందించాడు.
Pawan Kalyan: విద్యార్థి రాజాపు సిద్ధూ ప్రతిభను తెలుసుకున్న పవన్ కల్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి రప్పించుకున్నారు. విశేష ప్రతిభ చాటిన ఆ విద్యార్థిని మెచ్చుకున్నారు. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ప్రోత్సహించారు. సిద్ధూ రూపొందించిన సైకిల్‌పై అతడిని వెనుక కూర్చొబెట్టుకొని స్వయంగా పవన్ కల్యాణ్ నడిపారు. ఆ తర్వాత రూ.లక్ష ప్రోత్సహక నగదు బహుమతిని అందజేశారు.

