Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో ఇటీవల జరిగిన గేమ్‌చేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి ఇండ్లకు వెళ్తుండగా, ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఆ యువకులు వస్తున్న బైక్‌ను వ్యాన్ ఢీకొనడంతో వారిద్దరూ మృతిచెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం విచారం వ్యక్తం చేశారు. ఇద్దరు కుటుంబ సభ్యులకు చేరో రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ యువకులు దుర్మరణం పాలైన ఘటనా స్థలాన్ని పవన్ కల్యాణ్ శుక్రవారం స్వయంగా పరిశీలించారు.
Pawan Kalyan: రాజమండ్రి సమీపంలోని రంగంపేట కార్గిల్ వద్ద ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డీఎస్పీ భవ్య కిషోర్‌తో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ ప్రమాదంలో మణికంఠ, చరణ్ అనే యువకులు దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబ స్థితిగతుల గురించి జనసేన నాయకుల ద్వారా పవన్ కల్యాణ్ వాకబు చేశారు. రోడ్డు ప్రమాద ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.