Gold Price: కొత్త సంవత్సరంలో పుత్తడి ధరలు భారీగా పెరుగుతాయన్న విశ్లేషకుల అంచనాలు నిజమవుతూనే ఉన్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా ధరలు పెరగడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ధర నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెరిగిన ధరలు వినియోగదారుల్లో గుండె దడ పుట్టిస్తున్నాయి.
Gold Price: ధరల పెరుగుదల ప్రభావం కొనుగోళ్లపైనా పడనున్నది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారంపై రూ.270 మేర ధర పెరిగింది. దీంతో హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,470గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,850గా నమోదైంది. అదే విధంగా ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,620గా, బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,470గా నమోదైంది.