Brahma Anandam

Brahma Anandam: ఆనందమానందమాయే…’ అంటున్న బ్రహ్మానందం తనయుడు!

Brahma Anandam: ‘మళ్ళీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు రాహుల్ యాదవ్ నక్కా. ఆయన సంస్థ నుండి రాబోతున్న మరో సినిమా ‘బ్రహ్మా ఆనందం’. బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ తాతామనవళ్ళుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లు. ఆర్.విఎస్. నిఖిల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గురువారం ఈ సినిమా నుంచి ‘ఆనందమాయే..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. శాండిల్య పీస‌పాటి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ పాట‌ను శ్రీసాయి కిర‌ణ్ రాయ‌గా, మ‌నీషా ఈర‌బ‌త్తిని, య‌శ్వంత్ నాగ్ ఆల‌పించారు. ఇందులో ‘వెన్నెల’ కిషోర్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తుండగా, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  devara: దీపావళిలకే ఓటీటీలో ‘దేవర’!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *