Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కల్యాన్ నటించిన, సుజీత్ తెరకెక్కించిన తాజా సినిమా ఓజీ సినిమా త్వరలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రానున్నది. ఈ మేరకు మేకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 23వ తేదీన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. పవన్‌కల్యాన్ అభిమానులకు మరింత ఆనందం కలిగించే వార్త ఇది.
Pawan Kalyan: తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు తెలిపారు. గత నెల (సెప్టెంబర్) 25న ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల్లో ఇది మిక్స్‌డ్ టాక్ వచ్చిందని అంటారు. అభిమానులు మాత్రం పండుగే చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సరిగ్గా 4 వారాల్లోనే ఓటీటీలోకి రాబోతుందన్నమాట.