Pawan Kalyan: ఒకప్పుడు మణిరత్నం దర్శకత్వంతో సినిమాలు చేయాలని తెలుగు హీరోలు తహతహలాడారు. కానీ నాగార్జున ఒక్కడికే మణిరత్నంతో స్ట్రయిట్ తెలుగు మూవీలో నటించే అదృష్టం దక్కింది. కొందరు తెలుగు నటీనటులు మణిరత్నం రూపొందించిన తమిళ చిత్రాలలో నటించారు. ఇరవై యేళ్ళ క్రితం మణిరత్నం తమిళ, హిందీ భాషల్లో ‘యువ’ సినిమాను తీశారు. అప్పట్లోనే ఆయన దీనిని తెలుగులో కూడా చేయాలని అనుకున్నారట. తమిళంలో సూర్య, సిద్ధార్థ్ చేసిన పాత్రల కోసం పవన్ కళ్యాణ్, రవితేజను సంప్రదించారట. కానీ ఈ సినిమా కథపై పెద్దంత నమ్మకంలేని పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మణిరత్నం తమిళ, హిందీ భాషలకే పరిమితం అయిపోయారు. ఈ రెండు భాషల్లోనూ బాగానే ఆడిన ‘యువ’ తెలుగులో డబ్ అయ్యింది కానీ పెద్దంతగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. అదే తెలుగులో పవన్, రవితేజ నటించి ఉంటే కథ మరోలా ఉండేదేమో!

