Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా జ్వరం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అయితే ఈరోజు ఆయనకు జ్వరం మరింతగా పెరగడంతో వైద్యులను సంప్రదించారు.
వైద్యులు పవన్ కల్యాణ్‌కు మెడికల్ పరీక్షలు నిర్వహించారు. జ్వరం నుంచి కోలుకోవడానికి మందులు ఇవ్వడంతో పాటు, కనీసం రెండు నుండి మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అందువల్ల ఆయన అధికారిక కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.