ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షను విరమించారు. తిరుమలలోని వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆయన దీక్షను విరమించారు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడడంతో స్వామి అపచారం జరిగింది, క్షమించు అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
బుధవారం ఉదయం ఇద్దరు కుమార్తెలతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. అనంతరం వారాహి డిక్లరేషన్ బుక్కును శ్రీవారి పాదాల వద్ద ఉంచిన పవన్ కల్యాణ్ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.