pawan kalyan: గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కోసం పలు చర్యలు తీసుకుంటూ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడవితల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా, గిరిజన ప్రాంతాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది.
అడవిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుంది.. నీడనిస్తుంది..” అన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. “ఏజెన్సీ గ్రామాల్లో డోలీ కష్టాలు చూశాం.. ఆదివాసీ గ్రామాలకు సరైన రహదారులు లేవు..” అని అన్నారు. “మన్యం ప్రాంతాల్లో రోడ్లు వేయాలని సీఎం ఇంటికి వెళ్లి కోరాను.. నేను కోరిన వెంటనే రూ.49 కోట్లు మంజూరు చేశారు.” అని తెలిపారు.అలాగే, జాతీయ ఉపాధి హామీ పథకం కింద, గ్రామీణ ప్రాంతాలలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రూ.400 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
పవన్ కల్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎంతో ముఖ్యమైన సూచనలు ఇచ్చాయి. రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల సౌకర్యం, ఆదివాసీ ప్రజల భద్రత, మరియు వారి జీవన ప్రమాణాల విషయంలో ప్రభుత్వం చేపట్టే చర్యలు మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉంది.