Pawan Kalyan: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిని ఖండిస్తూ, ఇది కేవలం వ్యక్తిపై దాడి కాకుండా ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు. రంగరాజన్‌పై దాడి చేసిన మూకను గుర్తించి, కఠినంగా శిక్షించాలని ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అదనంగా, జనసేన పార్టీ తెలంగాణ విభాగానికి చిలుకూరు వెళ్లి రంగరాజన్‌ను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రధాన నిందితుడు రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) కూడా స్పందించారు. దాడి చేసిన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని, రంగరాజన్ కుటుంబానికి పూర్తి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ఘటనపై భక్తులు, సామాజిక వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

