Pawan Kalyan: మూడు రోజుల ఫ్లెమింగో ఫెస్టివల్‌కు 7-8 లక్షల మంది హాజరవ్వచ్చు

Pawan Kalyan: పులికాట్‌ సరస్సు మరియు కుంకీ ఏనుగుల ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తామని పవన్‌ తెలిపారు. ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా పులికాట్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు.ప్రతి సంవత్సరం 6 నెలలపాటు పులికాట్‌ పరిసర ప్రాంతాల్లో వేలాది ఫ్లెమింగోలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

మూడు రోజుల ఫ్లెమింగో ఫెస్టివల్‌కు 7-8 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని తెలిపారు.కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని కూడా పర్యావరణ పర్యాటకంలో భాగంగా అభివృద్ధి చేస్తామని పవన్‌ ట్వీట్‌లో తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *