Pawan Kalyan: డ్రగ్స్ పై సంచలన ట్వీట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. మాద‌క‌ద్ర‌వ్యాల‌ విష‌య‌మై ‘ఎక్స్’ వేదిక‌గా స్పందించారు. “రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది. మునుపటి అవినీతి, నేర పాలన నుండి సంక్రమించిన మరొక వారసత్వ సమస్య. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి.

కొంతకాలం క్రితం విశాఖపట్నంలో సీజ్ చేసిన డ్ర‌గ్స్ లింకులు విజ‌య‌వాడ‌లోని ఒక వ్యాపార సంస్థలో తేలాయి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. గత పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందింది. నేర‌గాళ్ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్రం చ‌ర్య‌లు తీసుకోవాలి. దీనికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం” అని పవన్ ట్వీట్ చేశారు.

కాగా, గతంలో ఎన్నికల ప్రచారంలోనూ పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో డ్రగ్స్ పై స్పందించారు. ఏపీ యువత డ్రగ్స్ కి దూరంగా ఉంచాలని వైసిపి ప్రభుత్వం పై అప్పట్లో నిప్పులు చెరిగారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *