Pawan Kalyan: అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టేందుకు గత ఐదేళ్లుగా నిరంతరంగా పోరాడిన అమరావతి రైతులకు న్యాయం దక్కింది. రాజధాని కోసం గళం విప్పిన వారు చివరికి విజయం సాధించడం గర్వకారణంగా మారింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచుతామని మేము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. రైతులు పోరాటం ధర్మయుద్ధంగా నిలిచింది. వారు గెలిచారు,” అని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం పాలనలో అమరావతి భవిష్యత్‌ను తుడిచిపెట్టేసిందని ఆరోపిస్తూ, అభివృద్ధిని ముందుకు తీసుకురావడంలో వెనుకబడ్డారని విమర్శించారు. మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో అభివృద్ధి పనులు స్థగించాయన్నారు. అయితే, ఇప్పుడు కేంద్రం మరియు రాష్ట్రంలో ఎన్డీయే శక్తిగా ఉండటంతో అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునఃనిర్మాణ సభకు హాజరుకావడం ఒక ముఖ్యమైన సూచనగా పేర్కొన్నారు. ఇది కేంద్రం పూర్తిగా అమరావతి అభివృద్ధికి అంకితమై ఉన్నదని వెల్లడిస్తుందని అన్నారు.
చివరగా పవన్ కళ్యాణ్ చంద్రబాబునాయుడును ప్రశంసిస్తూ, “20 ఏళ్ల క్రితమే భవిష్యత్‌ను ఊహించి, అమరావతిని ఒక ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దే ప్రణాళికతో ముందుకు వెళ్లగల నాయకుడు చంద్రబాబు,” అని అభిప్రాయపడ్డారు.

