Tata Steel Chess 2024: టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్ సన్ టైటిల్ విజేతగా నిలిచాడు. 7.5 పాయింట్లతో ఎవరికీ అందనంత ఆధిక్యంలో నిలిచిన కార్ల్ సన్ టైటిల్ అందుకున్నాడు. కాగా, భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద 5.5 పాయింట్లు సాధించి రెండోస్థానంతో రన్నరప్ గా నిలిచాడు. వెస్లీ సో కూడా 5.5 పాయింట్లే సాధించినప్పటికీ మెరుగైన టైబ్రేక్ స్కోరుతో ప్రజ్ఞానంద రెండో స్థానం లో నిలిచాడు. మహిళల విభాగంలో వంతిక అగర్వాల్ మూడో స్థానంలో నిలవగా, 4.5 పాయింట్లతో హారిక 5వ స్థానంలో 3 పాయింట్లతో హంపి పదో స్థానంలో నిలిచింది.7.5 పాయింట్లతో మహిళల టైటిల్ ను గోర్యాచినా గెలుచుకుంది.