RGV: ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కు రంగం సిద్ధం అయింది . ప్రకాశం జిల్లా పోలీసులు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడం కోసం హైదరాబాద్ వచ్చారు . ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఇంటిదగ్గర ఒంగోలు పోలీసులు ఉన్నారు . సోషల్ మీడియాలో కించపరిచే పోస్టులు పెట్టినందుకు గాను ఆయనపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నెల 19వతేదీన విచారణకు హాజరు కావాలని ప్లీసులు నోటీసులు ఇచ్చారు . అయితే , ఆరోజు ఆయన హాజరు కాలేదు. తనకు వారం రోజులు సమయం కావాలని కోరారు ఆర్జీవీ. తరువాత మరోసారి ఈరోజు విచారణకు రావాలని ఈనెల 20న నోటీసులు ఇచ్చారు పోలీసులు . ఈరోజు కూడా విచారణకు హాజరు కాని ఆర్జీవీ . . తనకు మరో వారం సమయం కావాలని పోలీసులను కోరారు. రెండోసారి నోటీసుకు కూడా డుమ్మా కొట్టడంతో ఒంగోలు పోలీసులు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు . ఈ మేరకు హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ నివాసానికి పోలీసులు చేరుకున్నారు.
ఈ వార్త అప్డేట్ అవుతోంది . .