SRH: ఈ సీజన్‌లో ఏదైనా విజయం సాధించి ట్రోఫీని గెలుచుకోవాలని పట్టుదలతో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభవార్త వచ్చింది. గాయం కారణంగా ఇబ్బందుల్లో ఉన్న జట్టు స్టార్ ప్లేయర్ ఇప్పుడు కోలుకుంటున్నాడు మరియు ఈ సీజన్‌లో తిరిగి ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అతను ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేందుకు సిద్ధమైనట్లు చెప్పాడు. ఇంతకీ ఈ స్టార్ ప్లేయర్ ఎవరంటే…. ఆస్ట్రేలియా టెస్ట్ వన్డే కెప్టెన్, సన్రైజర్స్ హైదరాబాద్ కీ ప్లేయర్ ప్యాట్ కమిన్స్.
గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి దూరంగా ఉన్న కమిన్స్, ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నాడు. అతను మార్చిలో జరగబోయే ఐపీఎల్‌తో పాటు, జూన్‌లో సౌత్ ఆఫ్రికాతో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సిద్ధంగా ఉండే దిశగా ముందుకు సాగుతున్నాడు. తాజాగా తన గాయం గురించి కమిన్స్ ఇచ్చిన అప్డేట్‌లో ఈ విషయాలు తెలిశాయి.
నా చీలిమండ గాయం తగ్గుతోంది. మొదట్లో బాగా బలంగా ఉందని అనుకున్నాను కానీ నేను సరైన విశ్రాంతి తీసుకున్నాను, దీంతో గాయం క్రమంగా మానుతోంది అని అన్నాడు. ఈ సమయంలో క్రికెట్ ఆడకపోవడం వల్ల గాయం నుండి త్వరగా కోలుకుంటున్నాను అని తెలిపిన కమిన్స్… ఐపీఎల్‌కు ముందు పూర్తిగా సిద్ధం కావడమే తన లక్ష్యం అని తెలిపాడు.
SRH: తాను బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడని… బలంగా ఐపీఎల్ కు తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక తన విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కమిన్స్ తెలిపాడు.
“ఈ గాయానికి సర్జరీ కంటే ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిదని నేను నిర్ణయించుకున్నాను. కొన్నిసార్లు క్రికెట్ టూర్ల కోసం తొందరగా చికిత్స తీసుకోవడం కంటే, టూర్‌ను మిస్ చేసి క్రమంగా చికిత్స పొందడం మంచిది. ఒక టూర్ మిస్ అయ్యాకేమీ జరగదు. ఇంకా మనకు ఎక్కువ క్రికెట్ ఆడే అవకాశాలు దొరుకుతాయి,” అని ప్యాట్ వివరించాడు.
మరోవైపు, ఐపీఎల్ 2025 సీజన్‌ను సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.