Pashamylaram:సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామకవాడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 42కు చేరుకున్నది. గుర్తించడానికి వీలు లేకుండా ఉన్న ఆ మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రిలో కుప్పలుగా పడి ఉన్నాయి. ఆరు మృతదేహాలనే గుర్తించిన అధికారులు, ఇతర మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు చేస్తేనే మృతులను గుర్తించే వీలున్నదని అక్కడి వైద్యులు నిర్ధారించారు.
Pashamylaram:పాశమైలారం అగ్నిప్రమాద ఘటన సమయంలో 143 మంది కార్మికులు ఉన్నారని గుర్తించారు. అడ్మినిస్ట్రేషన్ భవన శిథిలాను తొలగిస్తున్నారు. ఈ శిథిలాల కింద వారిలో చాలా మంది ప్రాణాలిడిసినట్టు సమాచారం అందుతున్నది. ఇప్పటి వరకు 42 మృతదేహాలను వెలికితీశారు. శిథిలాలను పూర్తిగా తొలగిస్తూ, ఆ శిథిలాల కింద మరింత మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. పేలుడు ఘటన జరిగినప్పుడు 100 మీటర్ల దూరం వరకు కార్మికులు ఎగిరిపడ్డారు.
Pashamylaram:ప్రమాద బాధితుల కోసం సంగారెడ్డి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రమాద బాధితుల వివరాల కోసం 08455276155ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే మృతులు, ఆచూకీ తెలియని కార్మికుల కుటుంబలు, బంధుమిత్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకున్నది.