Pushpa 2: ఐకాన్ స్టార్ పుష్ప 2 విడుదలకు ఇంకా ఏడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సినిమాపై బజ్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. డిసెంబర్ 5న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది. ‘పుష్ప 2 ది రూల్’ సెన్సార్ లో ఎటువంటి సమస్యలు లేకుండా బయటకు వచ్చింది.
సినిమా రన్ టైమ్ ఎంతంటే?
ఈ చిత్రం 2021 సంవత్సరంలో విడుదలైన పుష్ప: ది రైజ్ సినిమాకి సీక్వెల్ అని తెలిసిందే. 2021లో అల్లు అర్జున్ ‘పుష్పరాజ్’గా వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించాడు. సినిమా విజయాన్ని చూసిన మేకర్స్ దాని రెండవ భాగాన్ని 22 ఆగస్టు 2022న ప్రకటించారు. ఈ సినిమా మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
పుష్ప 2 కి అయితే అందులో కొన్ని స్వల్ప మార్పులను బోర్డు సూచించింది. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. బోర్డు నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ప్రేక్షకులు కూడా హ్యాపీగా ఉన్నారు. సినిమా రన్ టైమ్ గురించి చెప్పాలంటే దాదాపు మూడు గంటల ఇరవై నిమిషాలు.
నిర్మాతలు మొదట్లో సినిమా లాంగ్ రన్ గురించి కొంచెం భయపడినా, ఇటీవల విడుదలైన కల్కి 2898 AD, యానిమల్ వంటి ఎక్కువ రన్ టైమ్ ఉన్న సినిమాల విజయంతో దీనిపై కూడా ధైర్యంగా ఉన్నారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను తమ సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుందని సుకుమార్ అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Ram Gopal Varma: ఏపీ హైకోర్టు మెట్లెక్కిన దర్శకుడు వర్మ.. విచారణ వాయిదా !
సినిమాకు ప్రధాన ఆకర్షణలు..
Pushpa 2: సెన్సార్ బోర్డ్ లోని కొందరు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సినిమాలోని ‘గంగమ్మ తల్లి జాతర’ సీన్ చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. కొన్ని యాక్షన్ బ్లాక్‌లు అద్భుతంగా కొరియోగ్రఫీ చేసినట్టు చెబుతున్నారు. అలాగే, అల్లు అర్జున్ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాదంటున్నారు. ఇక ఈ చిత్రం రికార్డు వసూళ్లతో రికార్డ్ సృష్టిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు ఫహద్ ఫాసిల్, శ్రీలీల, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. టి సిరీస్ సంగీతం అందించింది. ఈ సినిమా ట్రైలర్, పాటలు సంచలనం సృష్టించాయి.