Bandaru Sravani Sree: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు గడిచిన తర్వాత.కూటమి పాలన ఇప్పుడిప్పుడే గాడిలో పడింది. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా దూసుకెళ్తుంది.
ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రజా పాలనను వేగవంతం చేస్తున్నారు.సంక్షేమంతో పాటు అర్హులైన పేద ప్రజల పథకాలను ఇంటి గుమ్మం వద్దకు చేరుస్తున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు 24×7మానిటరింగ్ చేస్తూ ప్రజా ప్రతినిధులను అధికారులు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.అధినేత చంద్రబాబుతో పోటీ పడి అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ప్రత్యేక ఫోకస్ చేశారంట..
Bandaru Sravani Sree: బండారు శ్రావణి శ్రీ ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలలు పాలనలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకరం చుట్టారు.నియోజకవర్గానికి ప్రధానంగా తాగు సాగునీరుపైన ప్రత్యేక ఫోకస్ చేశారంట… గెలిచిన మూడు నెలల్లోనే మిడ్ పెన్నార్ డ్యాం కుడి కాలువకు 130 రోజులు పాటు ఆన్ అండ్ ఆఫ్ లేకుండా కంటిన్యూగా సాగునీరు అందిస్తున్నారు. గత వైసీపీ పాలకులు పట్టించుకున్న పాపాను పోలేదు. ఇక శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు, ఎల్లనూరు రెండు మండలాలు ఫ్యాక్షన్‌కి నిలువెత్తున నిదర్శనం. కొన్ని దశాబ్దాలుగా అక్కడ కృష్ణా, తుంగభద్ర జలాలు ప్రవహించాల్సిన చోట రక్తం ఏరులై పారిందని చెప్పవచ్చు.అనేకమంది నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారే తప్ప అభివృద్ధి నోచుకోలేదంట.టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సమయంలో పుట్లూరు, ఎల్లనూరు రైతు సోదరులు తమ గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Legally Veer: రియల్ కోర్ట్ డ్రామాగా లీగల్లీ వీర్
Bandaru Sravani Sree: అంతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎమ్మెల్యేగా బండారు శ్రావణి గెలిచిన నాలుగు నెలల్లోనే ఆ రెండు మండలాలు రైతులకు పచ్చని పొలాల్లో తుంగభద్ర కృష్ణమ్మ జలాలు తీసుకెళ్లి ప్రజలు మనసు గెలుచుకున్న ఎమ్మెల్యే.. అయితే ఆ ఫలితం ఒక వారం ఒక నెలలో రాలేదని చెప్పవచ్చు… ఆమె రాత్రి పగలు అనే తేడా లేకుండా రైతులకు సకాలంలో నీరు అందించాలని ఉద్దేశంతో ఇరిగేషన్ అధికారులుతో కలిసి అర్ధరాత్రి సమయంలో కాలవ గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించి వెంటనే ఆ కాలువ మరమ్మత్తులు పనులు చేయించారు. అలా దాదాపు రెండి నెలలు పైన కాలువలు పైన పరివేక్షించి దిగవునున్న ఆయకట్టు వరకు నీరు అందించారు ఎమ్మెల్యే బండారు శ్రావణి…
Bandaru Sravani Sree: తమ ప్రభుత్వం ఓటు బ్యాంకు ఫ్యాక్షన్ రాజకీయాలు చెయదు… ప్రజలు సంక్షేమమే మా లక్ష్యం.. చంద్రబాబు, లోకేష్‌లు చెప్పిన మాటలు ఎమ్మెల్యే బండారు శ్రావణి అంటున్నారు. పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో ప్రజా ప్రతినిధులు అడుగుపెట్టారంటే హై టెన్షన్ రాజకీయం వాతావరణం ఉండేది.పాలన గాలికి వదిలేసేవారు. ప్రజల సమస్యలు మాత్రం తీర్చే నాయకుడే కరువయ్యారంట.ఎమ్మెల్యే బండారు శ్రావణి గెలిచిన తర్వాత పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో అభివృద్ధికి నాంది పలికారు.ఇప్పటికీ రెవిన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యను పరిష్కరిస్తున్నారు. అదే విధంగా ప్రతి గ్రామానికి తాగునీరు సీసీ రోడ్లు డ్రైనేజ్ ఇలా కనీస మౌలిక పనులను పూర్తి చేస్తున్నారు.. ఎమ్మెల్యే బండారు శ్రావణి…
Bandaru Sravani Sree: ఎమ్మెల్యే బండారు శ్రావణిపైన ఆరు నెలల్లో అనేక విమర్శలు ప్రతి విమర్శలు… ఎమ్మెల్యే మాత్రం వాటిని పాజిటివ్‌గా తీసుకొని అధినేత చంద్రబాబు స్ఫూర్తితో లోకేష్ సూచనలతో శింగనమల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ నిధులతో సీసీ రోడ్లు పనులు వేగంగా నడుస్తున్నాయి.అదే విధంగా తాగినీరు జటిలంగా ఉన్న కొన్ని గ్రామాలపైన ప్రత్యేక దృష్టి సాధించారంట..ఇక నియోజకవర్గవ్యాప్తంగా రెవిన్యూ సదస్సులు నిర్వహించి గ్రామాల్లో భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ధైర్యం నింపుతున్నారు.ఎందుకంటే గత ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు పేదల భూములను కబ్జా చేశారు.
రెవిన్యూ సదస్సుల్లో గుట్టలు గుట్టలుగా అర్జీలు ఇస్తున్నారంట స్థానిక ప్రజలు… నియోజకవర్గంలో భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారందరికీకచ్చితంగా తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే బండారు శ్రావణి. ఇక శింగనమల అంటేనే హార్టికల్చర్ హబ్.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి రైతుకు డ్రిప్ పరికరాలు సబ్సిడీతో అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: E Sala cup namde: ఈ సాలా కప్ నామ్దే అంటున్న అభిమానులు! మరి ఈ జట్టు తో సాధ్యమేనా
Bandaru Sravani Sree: బండారు శ్రావణి శింగనమలలో గెలిచిన ఆరు నెలల తర్వాత తన రాజకీయ మార్పు కనిపిస్తుందట… ఎందుకంటే అభివృద్ధితో పాటు పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గంలో కొందరు నాయకులు నుంచి విమర్శలు విభేదాలు వస్తున్న అందరిని కలుపుకొని అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే విధంగా అధికారులు నాయకులు ఏకతాటిపై తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారంట ఎమ్మెల్యే శ్రావణి… టీడీపీ సభ్యత్వ నమోదులో ఎమ్మెల్యే మార్కు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.కొందరు నాయకులు సహకరించకపోయిన సభ్యత్వ నమోదులో మాత్రం తగ్గేదేలే అనే విధంగా 40వేలు నుంచి 50వేలు దిశగా దూసుకెళ్తున్నారు.
Bandaru Sravani Sree: యువ ఎమ్మెల్యే బండారు శ్రావణి శింగనమలలో తన రాజకీయ మార్క్ చూపిస్తున్నారంట… ఇటు పాలనలోనూ అటు పార్టీని సమర్థవంతంగా నడిపించడానికి విమర్శలను విభేదాలను పక్కనపెట్టి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ కార్యకర్త దగ్గర నుంచి మండల నాయకులు వరకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా తన రాజకీయ ప్లాన్ డిజైన్ చేసుకుంటున్నారంట… 2025 కొత్త సంవత్సరం నుంచి బండారు శ్రావణి తన రాజకీయాన్ని కొత్త పంతుల తొక్కిస్తారా..
Bandaru Sravani Sree: పుట్లూరు, ఎల్లనూరు మండలాలతో సహా నియోజకవర్గవ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో వార్ వన్ సైడ్ టీడీపీ జెండా ఎగిరే విధంగా ఎమ్మెల్యే తన రాజకీయ వ్యూహాలుకు పదును పెడుతున్నారంట… నియోజకవర్గంలో వర్గపోరు లేకుండా అందరి నాయకులును కలుపుకొని ఐకమత్యంగా కలిసి రాజకీయం చేయబోతున్నారంట..చూడాలి మరి ఎమ్మెల్యే బండారు శ్రావణి కొత్త సంవత్సరం 2025 నుంచి రాజకీయం ఎలా ఉండబోతుంది అనేది చర్చ..నియోజకవర్గం అభివృద్ధితో పాటు ఎమ్మెల్యే బండారు శ్రావణి రాజకీయం ఎలా ఉంటుంది అనేది మాత్రం వెయిట్ అండ్ సీ.
రాసిన వారు: రామాంజనేయులు