Mass: తన దృష్టిలో పడ్డ ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తూ సాగారు కింగ్ నాగార్జున. ఆ తీరున ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ లారెన్స్ రాఘవేంద్రను దర్శకునిగా పరిచయం చేస్తూ ‘మాస్’ మూవీ నిర్మించారు నాగార్జున. తనకు లభించిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు లారెన్స్.
ఇది కూడా చదవండి: Bandaru Sravani Sree: ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ రాజకీయ & పాలన గాడిలో పడినట్టేనా.?
Mass: దర్శకునిగా తొలి చిత్రమే అయినా ‘మాస్’ను అనుభవమున్న డైరెక్టర్ లా రూపొందించారు లారెన్స్. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కినా, ఇందులో మాస్ మసాలాలు భలేగా దట్టించి రక్తి కట్టించారు లారెన్స్. 2004 డిసెంబర్ 23న విడుదలైన ‘మాస్’ చిత్రంలో జ్యోతిక, ఛార్మి నాయికలుగా నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు భలేగా సందడి చేశాయి. 2004 టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలచింది ‘మాస్’.